వార్తలకు తిరిగి వెళ్లండి

పెన్షన్ దరఖాస్తుల గడువును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించాలని సీపీఐ మండల కార్యదర్శి వియ్యపు రాజు డిమాండ్ చేశారు. గురువారం అనకాపల్లి సీపీఐ కార్యాలయంలో మాట్లాడుతూ పంచాయతీ కార్యాలయాల్లో సర్వర్ సమస్యలతో వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
వరుస సెలవుల కారణంగా కొంతమంది ధ్రువపత్రాలను కూడా పొందలేకపోయారని చెప్పారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని పెన్షన్ దరఖాస్తుల గడువు పొడిగించాలని కోరారు.
Comments
Loading comments...

