Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెండింగ్‌ వేతనాలు చెల్లించకుంటే విధుల బహిష్కరణ

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 11:33 AM ఆసిఫాబాద్General
పెండింగ్‌ వేతనాలు చెల్లించకుంటే విధుల బహిష్కరణ - Udayam
ఆసిఫాబాద్‌ మండలం రాజంపేట గ్రామ పంచాయతీ ఎదుట కార్మికులు పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ నిరసన చేపట్టారు. కొందరికి 11 నెలలు, జనరల్‌ ఫండ్‌ కార్మికులకు 5 నెలలు, ఇతర సిబ్బందికి 6 నెలలుగా వేతనాలు అందడం లేదని యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌ తెలిపారు. యూనిఫాం, షూస్‌, సేఫ్టీ కిట్లు ఇవ్వాలని కోరారు.దసరాలోగా సమస్యలు పరిష్కరించకపోతే విధులు బహిష్కరించి ధర్నా చేస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...