వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం ప్రజలకు అండగా ఉంటానని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. బుధవారం ఒక్కరోజులో 58 మంది లబ్ధిదారులకు రూ.41,26,030 విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు. పేదలకు వైద్య ఖర్చుల కోసం రూ.10 వేల నుంచి రూ.10 లక్షల వరకు సాయం అందిస్తున్నామన్నారు.
తుఫాన్ నేపథ్యంలో తీర, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. అధికారుల సూచనలు తప్పక పాటించాలన్నారు.
Comments
Loading comments...

