వార్తలకు తిరిగి వెళ్లండి

ఊట్కూర్ మండలం పెద్దజట్రం గ్రామపంచాయతీలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ నరేందర్ సూచనల మేరకు ఏఎన్‌ఎం అనంతమ్మ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ఇంటింటికీ వెళ్లారు.
ఇళ్ల పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించి పరిశుభ్రత పాటించాలని సూచించారు. దోమల వృద్ధిని అరికట్టేందుకు పరిసరాలపై శ్రద్ధ వహించాలని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బబిత, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

