Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాత ప్రభుత్వాల పాలసీలను రద్దు చేయలేదు: రేవంత్

Follow Udayam on Google
Harika Oct 14, 2026 2:50 PM హైదరాబాద్General
పాత ప్రభుత్వాల పాలసీలను రద్దు చేయలేదు: రేవంత్ - Udayam
తమ ప్రభుత్వం ఓపెన్ మైండ్‌తో పనిచేస్తోందని, పాలసీ పెరాలసిస్ లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 1994–2004 మధ్య చంద్రబాబు తీసుకొచ్చిన విధానాలను కాంగ్రెస్ కొనసాగించిందని, 2014–2023 మధ్య బీఆర్ఎస్ అమలు చేసిన మంచి విధానాలను తాము రద్దు చేయలేదని తెలిపారు. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడే విధానాలను మార్చలేదని హైదరాబాద్ హైటెక్స్‌లో జరిగిన బిజినెస్ సమ్మిట్‌లో సీఎం పేర్కొన్నారు.

Comments

G
Loading comments...