వార్తలకు తిరిగి వెళ్లండి

వేంపల్లి ప్రాంతంలో పాపాఘ్న నది ఆక్రమణలను అరికట్టాలని కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మూలంరెడ్డి ధ్రువకుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆర్‌డీఓ చిన్నయ్యకు వినతిపత్రం అందజేశారు.
నదిలో అక్రమ పంటల సాగు, బోర్ల కారణంగా నీరు కలుషితమై భూగర్భజలాలు పడిపోతున్నాయని ఆయన అన్నారు. అధికారులు వెంటనే సర్వే చేసి చర్యలు తీసుకోకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

