వార్తలకు తిరిగి వెళ్లండి

సంతబొమ్మాళి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన తంగి సీతమ్మ పాము కాటుకు గురై మృతి చెందారు. రెండు రోజుల క్రితం పొలం పనులకు వెళ్లిన సమయంలో పాము కాటేసింది.
కుటుంబ సభ్యులు వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో బుధవారం మృతి చెందినట్లు కుమారుడు తంగి వెంకటరమణ తెలిపారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Comments
Loading comments...

