పాక్ సైన్యంపై ఐరాసలో భారత్ విమర్శలు

పాకిస్థాన్ సైన్యం స్వప్రయోజనాల కోసం దేశ సహజ వనరులను దోచుకుంటోందని ఐరాస వేదికగా భారత్ ఆరోపించింది. సహజ వనరులపై జరిగిన సమావేశంలో భారత దౌత్యవేత్త పర్వతనేని హరీశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఖనిజాల పెట్టెను పాక్ సైన్యాధిపతి అసిం మునీర్ గతంలో ట్రంప్‌కు చూపించడాన్ని ప్రస్తావించారు.
సహజ సంపద ప్రజల సంక్షేమానికి ఉపయోగపడాలని, స్థానికులకు నేరుగా లబ్ధి చేకూరినప్పుడే శాశ్వత శాంతి సాధ్యమని హరీశ్ పేర్కొన్నారు.
Comments
Loading comments...
