వార్తలకు తిరిగి వెళ్లండి

నవాబుపేట్ మండలం పులుమామిడి, మాదిరెడ్డిపల్లి గ్రామాల్లో దుండగులు వ్యవసాయ బావుల వద్ద విద్యుత్ వైర్లను కత్తిరించి ఎత్తుకెళ్లారు. ఒక్క రాత్రిలోనే దాదాపు 17 బావుల వద్ద వైర్లు చోరీ కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
పంటలకు నీరు పారించే సమయంలో చోరీలు జరగడంతో సాగు పనులకు తీవ్ర ఆటంకం కలుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

