Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కెట్లకు చమురు షాక్‌.. 900 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 28, 2026 10:33 AM జాతీయంవాణిజ్యం
మార్కెట్లకు చమురు షాక్‌.. 900 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌ - Udayam
ముడిచమురు ధరలు పెరగడంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 900 పాయింట్లకు పైగా, నిఫ్టీ 23 వేల మార్క్‌ దిగువకు పడిపోయాయి. ఉదయం 9.45 గంటలకు సెన్సెక్స్‌ 907 పాయింట్లు నష్టపోయి 72,988.66 వద్ద ఉంది. నిఫ్టీ 268 పాయింట్లు క్షీణించి 22,871.90 వద్ద కొనసాగింది. మదుపర్ల సంపదలో రూ.6 లక్షల కోట్లు ఆవిరయ్యాయి.

Comments

G
Loading comments...