Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వామపక్షాలపై నిర్మల విమర్శలు

Follow Udayam on Google
రచన దేవి Aug 10, 2026 7:49 AM జాతీయంGeneral
వామపక్షాలపై నిర్మల విమర్శలు - Udayam
భారత్‌లోని కమ్యూనిస్టులు పిరికివాళ్లని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రాజ్యసభలో వ్యాఖ్యానించారు. యూపీఐ ఛార్జీలపై ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారంటూ సీపీఎం ఎంపీ జాన్‌ బ్రిట్టాస్‌పై విమర్శలు చేశారు. అమెరికా ఒత్తిడితో యూపీఐపై ఛార్జీలు విధిస్తున్నారన్న బ్రిట్టాస్‌ ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు. యూపీఐ లావాదేవీలు వినియోగదారులకు ఎప్పటిలాగే ఉచితంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...