Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిమజ్జనానికి వెళ్ళి నగర వాసి మృతి

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 25, 2026 6:41 PM హైదరాబాద్General
నిమజ్జనానికి వెళ్ళి నగర వాసి మృతి - Udayam
హైదరాబాద్ : సోమశిల కృష్ణా నదిలో వినాయక నిమజ్జనానికి వచ్చిన HYD ఉప్పుగూడకు చెందిన ఎస్. రాజు ముదిరాజ్ (30) ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. ఎస్సై ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం.. వినాయక విగ్రహాన్ని ఒడ్డున ఉంచి నదిలో స్నానానికి దిగిన రాజు, భద్రతా సిబ్బంది హెచ్చరించినా లోతు ప్రాంతంలోకి వెళ్లాడు. దీంతో నీటిలో మునిగిపోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...