Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిడమర్రులో మూడో రోజుకు చేరిన వీఆర్ఏల దీక్ష

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 1:40 PM ఏలూరుGeneral
నిడమర్రులో మూడో రోజుకు చేరిన వీఆర్ఏల దీక్ష - Udayam
నిడమర్రు మండల తహశీల్దార్‌ కార్యాలయం వద్ద వీఆర్ఏలు చేపట్టిన సహాయ నిరాకరణ దీక్ష శుక్రవారంతో మూడో రోజుకు చేరుకుంది. తమ న్యాయమైన కోర్కెలు వెంటనే నెరవేర్చాలని కోరుతూ వీఆర్ఏలు మోకాళ్లపై కూర్చుని దీక్ష చేశారు. వీఆర్ఏలకు నామినీలను గుర్తించాలని, జీతం పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని నినాదాలు చేశారు. సంఘం అధ్యక్షుడు సంకెళ్ల మోహనరావు, వైస్‌ ప్రెసిడెంట్‌ దాసరి కోటేశ్వరరావు, వీఆర్ఏలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...