Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలో రెండు రోజులు నీటి సరఫరా బంద్

Follow Udayam on Google
Girish Bidkar Oct 04, 2026 10:48 AM హైదరాబాద్General
నగరంలో రెండు రోజులు నీటి సరఫరా బంద్ - Udayam
నగరంలో రెండు రోజుల పాటు తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. కృష్ణా డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు ఫేజ్-2లో మరమ్మతులతో OCT 5న ఉ.6 నుంచి 6న సా.6 గంటల వరకు సరఫరా నిలిచిపోనుందని జలమండలి తెలిపింది. సికింద్రాబాద్, CNT, ఉప్పల్, తార్నాక, నల్లకుంట, మేకలమండీ పరిసరాలు, ఇటు ఆదిభట్ల, బాలాపూర్, బార్కాస్, శంషాబాద్, బిన్ రెడ్డి నగర్, వనస్థలిపురం ఏరియాలు ఎఫెక్ట్ అవుతాయి.

Comments

G
Loading comments...