Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తి హైవేకు కొత్త మార్గం

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Aug 12, 2026 7:21 AM కర్నూలుGeneral
కల్వకుర్తి హైవేకు కొత్త మార్గం - Udayam
కల్వకుర్తి–నంద్యాల 167కె జాతీయ రహదారికి ఆత్మకూరు–వెలుగోడు మధ్య నల్లమల అటవీ అనుమతులు ఆటంకంగా మారాయి. పైవంతెన నిర్మాణానికి భారీ వ్యయం కానుండటంతో ఎన్‌హెచ్‌ఏఐ ప్రత్యామ్నాయ మార్గంపై దృష్టి సారించింది. భానుముక్కల మలుపు నుంచి బనకచర్ల, వేంపెంట, గుంతకందాల మీదుగా రహదారి నిర్మాణానికి అధికారులు సర్వే ప్రారంభించారు. హైవే పూర్తయితే హైదరాబాద్‌–తిరుపతి మధ్య దూరం సుమారు 80 కి.మీ. తగ్గనుంది.

Comments

G
Loading comments...