Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు మహిళకు అంతర్జాతీయ డాక్టరేట్ గౌరవం

Follow Udayam on Google
మహేష్ కుమార్ Jun 27, 2026 12:02 PM నెల్లూరుGeneral
నెల్లూరు మహిళకు అంతర్జాతీయ డాక్టరేట్ గౌరవం - Udayam
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన డి. తులసి జ్యోతికి అంతర్జాతీయ గౌరవం దక్కింది. విద్యారంగంలో ఆమె చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా 'యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ అమెరికా' గౌరవ డాక్టరేట్ (డి.లిట్) ప్రకటించింది. జాతీయ స్థాయి విద్యా కార్యక్రమాలలో తులసి జ్యోతి కనబరిచిన అద్భుత ప్రతిభకు గాను, టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సిఫార్సులతో ఈ పురస్కారం లభించింది. ఆమె సాధించిన ఈ అరుదైన ఘనత పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Comments

G
Loading comments...