Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

27న జిల్లాకు ఎస్సీ కమిషన్ ఛైర్మన్

Follow Udayam on Google
Anuroop Aug 25, 2026 10:56 AM నెల్లూరుGeneral
 27న జిల్లాకు ఎస్సీ కమిషన్ ఛైర్మన్ - Udayam
షెడ్యూల్డ్ కులాల కమిషన్ ఛైర్మన్ కే.ఎస్. జవహర్ ఈ నెల 27న నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతిపత్రాలు స్వీకరిస్తారు. అనంతరం జిల్లా, మండల స్థాయి పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఎస్సీ సంక్షేమం, అత్యాచార నిరోధక చట్టాల అమలు, భూ సమస్యలు, రిజర్వేషన్లపై బాధితులు నేరుగా వినతులు సమర్పించవచ్చన్నారు.

Comments

G
Loading comments...