వార్తలకు తిరిగి వెళ్లండి

అశ్వారావుపేట మండలంలో వర్షాధారంగా సాగు చేస్తున్న పత్తిలో రైతులు దశలవారీగా యాజమాన్య పద్ధతులు పాటించాలని ఏడీఏ పెంటేల రవికుమార్ సూచించారు. పంట 40, 60, 80 రోజుల దశల్లో ఎకరాకు 25 కిలోల యూరియా, 10 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేయాలని తెలిపారు.
నేలలో తేమ ఉన్నప్పుడే ఎరువులు వేయాలని, తేమ సంరక్షణకు అంతరకృషి చేపడుతూ రసంపీల్చే, గులాబీరంగు పురుగుల ఉధృతిపై నిఘా ఉంచాలని సూచించారు.
Comments
Loading comments...

