వార్తలకు తిరిగి వెళ్లండి

బుచ్చయ్యపేట మండలం చిన్నప్పన్నపాలెంలో పాము కాటుకు పైలా ప్రసాద్ మృతి చెందాడు. సోమవారం పొలంలో ఆవును మేతకు తీసుకెళ్తుండగా పాము కాటేయడంతో కుటుంబ సభ్యులు నాటు వైద్యుడిని ఆశ్రయించినట్లు తెలిపారు. కాలికి పసరు మందు రాసి పంపినట్లు చెప్పారు.
పరిస్థితి విషమించడంతో మంగళవారం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రసాద్ మృతి చెందాడు. సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లలేదని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

