వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకి కోర్టు భవనాల సముదాయంలో సెప్టెంబర్ 12న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. దీనిపై ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి వెంకట నాగలక్ష్మి మంగళవారం పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఎక్కువ క్రిమినల్ కేసులు రాజీ ద్వారా పరిష్కారమయ్యేలా ఇరువర్గాలతో సామరస్యంగా మాట్లాడాలని సూచించారు. సమీక్షలో జూనియర్ సివిల్ జడ్జి సీత, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల పాల్గొన్నారు.
Comments
Loading comments...

