వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్‌లో పెరటి తోటలో కాసిన ఓ సొరకాయ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా సహజ పద్ధతుల్లో పండించిన ఈ సొరకాయ ఏకంగా నాలుగు అడుగులకు పైగా పొడవు పెరిగింది.
గ్రామానికి చెందిన మోతె ప్రవీణ్ ఇంటి వద్ద పందిరిపై ఈ వింత కాయ కాయడంతో స్థానికులు ఆసక్తిగా తిలకించారు.
Comments
Loading comments...

