వార్తలకు తిరిగి వెళ్లండి

ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రుద్రారం శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానంలో నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు మూడో రోజు వేడుకలు కొనసాగుతున్నాయి.
ఈ సందర్భంగా శ్రీ సిద్ధి గణపతి స్వామివారిని పీత వర్ణంలో విశేషంగా అలంకరించారు. ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు.
Comments
Loading comments...

