Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరులో గుండెపోటుతో SI మృతి

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 10:01 AM ఏలూరుGeneral
ఏలూరులో గుండెపోటుతో SI మృతి - Udayam
ఏలూరు జిల్లా ఏఆర్‌ విభాగంలో ఏఆర్‌ ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణ గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఏఆర్‌ అదనపు ఎస్పీ జి. మునిరాజా మంగళవారం హనుమాన్‌నగర్‌లోని ఆయన స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పోలీస్‌ శాఖ తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన, ఫ్యూనరల్‌ ఛార్జ్‌ రూ.25 వేలు, విడో ఫండ్‌ రూ.25 వేలు, ఫ్లాగ్‌ ఫండ్‌ రూ.50 వేల చెక్కులను కుటుంబ సభ్యులకు అందజేశారు.

Comments

G
Loading comments...