వార్తలకు తిరిగి వెళ్లండి

మురమళ్ల భద్రకాళి సమేత వీరేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణానికి పెదమడి వాసి కోసూరి వేంకట నారాయణ రవివర్మ రూ.1,01,116 విరాళం అందించారు. మంగళవారం చెక్కును దేవదాయ శాఖ ఏసీ సత్యనారాయణకు అందజేశారు.
గర్భాలయం, అంతరాలయం, నంది మండపం పనులు వేగంగా సాగుతున్నాయని ఏసీ తెలిపారు. రూ.లక్ష, అంతకంటే ఎక్కువ విరాళం ఇచ్చే దాతల పేర్లను శిలాఫలకంపై ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

