Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మునగపాక: ఒకే ఖాతా.. రూ.7 లక్షలు మాయం

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 8:18 AM అనకాపల్లి General
మునగపాక: ఒకే ఖాతా.. రూ.7 లక్షలు మాయం - Udayam
నాగులాపల్లి యూనియన్ బ్యాంకులో ఒకే ఖాతా నంబరును పోలవరపు జ్యోతి పేరున్న ఇద్దరు మహిళలకు కేటాయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఒకరి ఖాతాలో జమ అయిన సుమారు రూ.7 లక్షలను మరో మహిళ తనవేనని భావించి డ్రా చేసుకున్నట్లు బాధితురాలు తెలిపింది. బ్యాంకుకు వెళ్లి పరిశీలించగా ఖాతాలో నగదు లేకపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బ్యాంకు మేనేజర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధితులు ఆరోపిస్తూ, తమకు న్యాయం చేయాలని కోరారు.

Comments

G
Loading comments...