వార్తలకు తిరిగి వెళ్లండి

మురసు తుఫాను ప్రభావంతో ముదినేపల్లి మండలంలో మంగళవారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేని వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. పొలాల్లోకి భారీగా నీరు చేరింది.
లోతట్టు ప్రాంతాలు నీట మునగగా, డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. వర్షాల నేపథ్యంలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. రహదారులపై రాకపోకలు తగ్గి నిర్మానుష్యంగా మారాయి.
Comments
Loading comments...

