వార్తలకు తిరిగి వెళ్లండి

ముదిగుబ్బలో వీఆర్ఏలు చేపట్టిన నిరవధిక సమ్మె నాలుగో రోజుకు చేరుకుంది. శనివారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు.
సంఘం నాయకుడు ఓబుళపతి మాట్లాడుతూ వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని, అర్హులకు వీఆర్వోలుగా పదోన్నతులు కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. జీవో 402ను రద్దు చేయాలని వీరికి సీఐటీయూ నాయకులు అల్లా ప్రకాష్ ముత్తు మద్దతు తెలిపారు.
Comments
Loading comments...

