Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీఏపీ కేటాయింపుపై కేంద్ర మంత్రికి ఎంపీల వినతి

Follow Udayam on Google
రూప దేవి Aug 08, 2026 11:53 AM సంగారెడ్డిGeneral
డీఏపీ కేటాయింపుపై కేంద్ర మంత్రికి ఎంపీల వినతి - Udayam
తెలంగాణకు తగినంత డీఏపీ ఎరువులు కేటాయించాలని కోరుతూ నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిశారు. ఆయనకు వినతిపత్రం అందజేశారు. వినతిపై జేపీ నడ్డా సానుకూలంగా స్పందించి, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎంపీలు తెలిపారు. తెలంగాణ రైతులకు అవసరమైన మేరకు డీఏపీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

Comments

G
Loading comments...