వార్తలకు తిరిగి వెళ్లండి

మోత్కూర్ మండలంలో 300కుపైగా ట్రాన్స్ఫార్మర్లకు సిమెంట్ దిమ్మెలు లేకపోవడంతో రైతులు, పశువుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. దాచారం గ్రామంలో రహదారి పక్కన బండరాళ్లపై ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం ప్రమాదకరంగా మారింది.
దీనిపై విద్యుత్ ఏఈ ప్రభాకర్రెడ్డి స్పందిస్తూ.. ప్రమాదకరంగా ఉన్న 80 ట్రాన్స్ఫార్మర్లకు అంచనాలు సిద్ధం చేశామని, 40 దిమ్మెల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
Comments
Loading comments...

