వార్తలకు తిరిగి వెళ్లండి

కురుపాం మండలం మొండెంఖల్లు ZPH స్కూల్ భవనం శిథిలావస్థకు చేరి కూలిపోయే ప్రమాదం ఉందని స్థానికులు తెలిపారు. ఎప్పటినుంచో అలా వదిలేయడంతో మొక్కలు మొలిచి భారీ వృక్షాలుగా మారి ప్రమాదకరంగా తయారయ్యాయని పేర్కొన్నారు.
భవనం వీధికి ఆనుకుని ఉందని, బాగా పాడైపోయిందని, ఎప్పుడు కూలుతుందోనని భయాందోళనగా ఉందన్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

