Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లాయి చెరువు ఆక్రమణపై రైతుల ఆగ్రహం

Follow Udayam on Google
Harika Aug 26, 2026 12:26 PM యాదాద్రి భువనగిరిGeneral
మల్లాయి చెరువు ఆక్రమణపై రైతుల ఆగ్రహం - Udayam
రాజాపేట మండలం చల్లూరు పరిధిలోని మల్లాయి చెరువు ఆక్రమణకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ రైతులు, గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వే నంబర్లు 223, 224లోని చెరువు భూమిలో జేసీబీలతో చేపట్టిన పనులను వారు అడ్డుకున్నారు. చెరువు శిఖం, కట్టను తొలగిస్తున్నారని వారు ఆరోపించారు. దీనిపై గ్రామ పంచాయతీతో పాటు సోమవారం గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. చెరువు భూమిని కాపాడాలని అధికారులను కోరారు.

Comments

G
Loading comments...