వార్తలకు తిరిగి వెళ్లండి

50 ఏళ్లు నిండిన ప్రతి చేనేత కార్మికుడికి ఎలాంటి షరతులు లేకుండా పింఛన్ మంజూరు చేయాలని మోత్కూర్ పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు కూరపాటి రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చేయూత పథకం కింద అర్హులైన చేనేత కార్మికులందరికీ పింఛన్ అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ ప్రయోజనం కల్పించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో చేనేత సంఘం నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

