Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంజులపూర్ లో గణేష్ నిమజ్జనంలో విషాదం

Follow Udayam on Google
నిర్మల్ Sep 20, 2026 6:56 PM నిర్మల్General
మంజులపూర్ లో గణేష్ నిమజ్జనంలో విషాదం - Udayam
నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంజులాపూర్‌లోని సాయిబాబా ఆలయంలో ప్రతిష్ఠించిన వినాయకుడిని ఆదివారం నిమజ్జనానికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో వినాయక విగ్రహాన్ని ట్రాక్టర్‌పైకి ఎక్కిస్తుండగా ట్రాక్టర్‌పై ఏర్పాటు చేసిన డెకరేషన్ ఇనుప ఫ్రేమ్ విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో విద్యుత్ షాక్‌కు గురై ఎంబడి శివకుమార్‌ (35) అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై లింబాద్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...