Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SIR పై ఎమ్మెల్సీ విఠల్‌ సూచనలు

Follow Udayam on Google
Harika Aug 25, 2026 3:03 PM ఆసిఫాబాద్General
SIR పై ఎమ్మెల్సీ విఠల్‌ సూచనలు - Udayam
బెజ్జూర్‌ మండల కేంద్రంలో మంగళవారం కాంగ్రెస్‌ బీఎల్‌ఏల సమావేశం జరిగింది. సమావేశానికి ఎమ్మెల్సీ దండె విఠల్‌ హాజరై మాట్లాడారు. ఎస్‌ఐఆర్‌ ఫేజ్‌-2లో భాగంగా ఓటర్ల గణన జరుగుతోందని తెలిపారు. ధ్రువపత్రాలు లేనివారికి నోటీసులు ఇస్తారని చెప్పారు. నోటీసులు అందిన వారు 12 రకాల గుర్తింపు పత్రాల్లో ఒకటి సమర్పించి ఓటు హక్కును కాపాడుకోవాలని సూచించారు. ఈ విషయంపై బీఎల్‌ఏలు ఓటర్లను జాగ్రత్తపరచాలని కోరారు.

Comments

G
Loading comments...