Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మత్తు పదార్థాలు, సైబర్‌ మోసాలపై పోలీసుల అవగాహన

Follow Udayam on Google
Harika Aug 25, 2026 4:04 PM కరీంనగర్General
మత్తు పదార్థాలు, సైబర్‌ మోసాలపై పోలీసుల అవగాహన - Udayam
వీణవంక మండలం కోర్కల్‌ గ్రామంలో మంగళవారం జమ్మికుంట రూరల్‌ సీఐ పులి వెంకట్‌, వీణవంక ఎస్సై ఆవుల తిరుపతి ఆధ్వర్యంలో కమ్యూనిటీ మీటింగ్‌ నిర్వహించారు. గంజాయి, మత్తు పదార్థాల వినియోగం, సైబర్‌ మోసాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. అపరిచితుల ఫోన్‌ కాల్స్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు హెల్మెట్‌ ధరించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని తెలిపారు.

Comments

G
Loading comments...