వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ GGHలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు బుధవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కొవిడ్ సమయంలో కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రాణాలను లెక్కచేయకుండా సేవలందించిన తమకు సమాన పనికి సమాన వేతనం, గ్రాస్ వేతనం, ఉద్యోగ భద్రత కల్పించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
తక్కువ వేతనాలతో కుటుంబ పోషణ, ఇంటి అద్దె చెల్లించడం కష్టంగా ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు.
Comments
Loading comments...

