వార్తలకు తిరిగి వెళ్లండి

మీలాద్ ఉన్ నబీ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని గుంతకల్లు డి.ఎస్.పి శ్రీనివాసులు పట్టణ ప్రజలకు సూచించారు.ఆదివారం గుంతకల్లు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ముస్లిం పెద్దలు, పట్టణ పీస్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు.
డిఎస్పి మాట్లాడుతూ..ఈనెల 26న జరిగే మీలాద్ ఉన్ నబీ ర్యాలీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు గొడవల జోలికి వెళ్లకుండా పండగను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. గొడవలు సృష్టిస్తే చర్యలు తప్పవన్నారు.
Comments
Loading comments...

