Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో కుప్పకూలిన 5 అంతస్తుల భవనం

Follow Udayam on Google
Anuroop Oct 07, 2026 7:16 PM జాతీయంGeneral
ఈశాన్య ఢిల్లీలోని సీమాపురిలో బుధవారం ఐదు అంతస్తుల భవనం కుప్పకూలింది. మధ్యాహ్నం 3.30 గంటలకు సమాచారం అందడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద పలువురు చిక్కుకుని ఉండొచ్చన్న అనుమానంతో గాలింపు కొనసాగుతోంది. ఘటనతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. సత్య నికేతన్‌లో హాస్టల్‌ భవనం కూలి ఏడుగురు మృతి చెందిన నెల రోజులకే ప్రమాదం చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది.

Comments

G
Loading comments...