Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహాలక్ష్మి ఆలయంలో భక్తుల రద్దీ.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 07, 2026 9:14 PM జగిత్యాలతెలంగాణ
మహాలక్ష్మి ఆలయంలో భక్తుల రద్దీ. - Udayam
మెట్పల్లి పట్టణంలోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఆషాఢ శుక్రవారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి ఒడి బియ్యం పోసి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వెలమ కార్పొరేషన్ ఛైర్మన్ జువ్వాడి నర్సింగరావు అమ్మవారికి వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...