Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మధిరలో మహాప్రస్థానం పనుల పరిశీలన

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 4:10 PM ఖమ్మంGeneral
మధిరలో మహాప్రస్థానం పనుల పరిశీలన - Udayam
మధిర శ్మశానవాటికలో మహాప్రస్థానం ఏర్పాటుకు చేపడుతున్న సర్వే పనులను పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు తలుపుల వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు, మున్సిపల్‌ అధికారులతో కలిసి సోమవారం పరిశీలించారు. సరిహద్దుల ఏర్పాటుపై పనుల పురోగతిని సమీక్షించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కృషితో అంతిమ సంస్కారాలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు నాయకులు తెలిపారు.

Comments

G
Loading comments...