వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరుకు చెందిన మాల రవి పాము కాటుతో మృతి చెందాడు. రెండు రోజుల క్రితం దేవనకొండలోని అత్తింటికి వెళ్లిన ఆయన నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
నెల రోజుల క్రితమే రవికి దేవనకొండకు చెందిన లక్ష్మితో వివాహం జరిగినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. నవవరుడి మృతితో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.
Comments
Loading comments...

