Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైలవరం బస్టాండ్‌లో రూ.2.50 లక్షల చోరీ.. ఐదుగురు మహిళల అరెస్ట్

Follow Udayam on Google
Shruthi Nov 18, 2026 9:35 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
మైలవరం బస్టాండ్‌లో రూ.2.50 లక్షల చోరీ.. ఐదుగురు మహిళల అరెస్ట్ - Udayam
మైలవరం ఆర్టీసీ బస్టాండ్‌లో రద్దీని ఆసరాగా చేసుకుని ప్రయాణికుడు శీలం రాజశేఖర్‌రెడ్డికి చెందిన రూ.2.50 లక్షలను ఐదుగురు మహిళల ముఠా అపహరించింది. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు, సాంకేతిక ఆధారాల సాయంతో నిందితులను గుర్తించి మైలవరం మార్కెట్ యార్డు వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...