Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మానవతా దృక్పథం చాటుకున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.. అనాథ బాలికలకు గురుకుల ప్రవేశం

Follow Udayam on Google
Super Admin Jul 27, 2026 1:57 PM జగిత్యాలGeneral
మానవతా దృక్పథం చాటుకున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.. అనాథ బాలికలకు గురుకుల ప్రవేశం - Udayam
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన కనక శారద అనే మహిళ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. తల్లిని కోల్పోయి నిరాశ్రయులైన నలుగురు అనాథ ఆడపిల్లల దీనస్థితిని తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వెంటనే స్పందించారు.​సోమవారం నాడు ఆ నలుగురు పిల్లల్లో ఇద్దరు బాలికలకు తాటిపల్లి గురుకుల పాఠశాలలో ప్రవేశం కల్పించారు. ఈ సందర్భంగా బాలికల ఉన్నత చదువులకు, భవిష్యత్తుకు పూర్తి భరోసా కల్పిస్తూ అండగా ఉంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ మానస కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బత్తిని శ్రీనివాస్ గౌడ్,ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...