Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మానోపాడులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 9:49 AM జోగులాంబ గద్వాల్ General
మానోపాడులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి - Udayam
మానోపాడు మండలం జల్లాపూర్‌ శివారులో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఐదుగురిని అదుపులోకి తీసుకుని రూ.2,280 నగదు, పేకముక్కలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల రాకను గమనించిన మరో ఇద్దరు పరారయ్యారు. నిందితులంతా జల్లాపూర్‌కు చెందినవారేనని ఎస్‌ఐ స్వాతి తెలిపారు. పరారైన వారి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో పేకాట జరుగుతున్నట్లు తెలిస్తే సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.

Comments

G
Loading comments...