Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మాజీ కేంద్ర మంత్రి సుదర్శన్ నాచియప్పన్ కన్నుమూత

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 7:41 AM హైదరాబాద్General
మాజీ కేంద్ర మంత్రి సుదర్శన్ నాచియప్పన్ కన్నుమూత - Udayam
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర సహాయమంత్రి సుదర్శన్ నాచియప్పన్ (78) గురువారం తమిళనాడులోని తన నివాసంలో కన్నుమూశారు. వయోభారంతో వచ్చిన అనారోగ్య సమస్యలతో ఆయన తుదిశ్వాస విడిచారు. శివగంగై నుంచి లోక్‌సభకు, అనంతరం రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన ఆయన సీనియర్ న్యాయవాదిగా, ఏఐసీసీ కార్యదర్శిగా సేవలందించారు. 2013-14లో కేంద్ర సహాయమంత్రిగా పనిచేశారు. ఆయన మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Comments

G
Loading comments...