వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ సిటీతో పాటు సదరన్ డిస్కం పరిధిలోని 47,854 గణేశ్ మండపాలకు 104 మెగావాట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నారు. నిర్వాహకులపై ఆర్థిక భారం పడకుండా ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
విద్యుత్ ఛార్జీల కింద రూ.16.54 కోట్లను ప్రభుత్వం భరిస్తోంది. నిరంతర విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు, 24 గంటలపాటు సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

