Back to feed
డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల రుణం
Vikram Jun 11, 2026 12:38 PM అమరావతి 8 views4 days ago

ఏపీలోని డ్వాక్రా మహిళలకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.10 లక్షల వరకు వ్యక్తిగత రుణం మంజూరు చేయనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. మహిళల ఆర్థికాభివృద్ధికి ఈ నిర్ణయం ఎంతో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వ దీన్ దయాల్ అంత్యోదయ యోజన (NRLM), ఐఈఎల్‌ఏ (IELA) విధానం ద్వారా ఈ రుణాలు అందిస్తారు. అర్హులైన డ్వాక్రా మహిళలందరూ ఈ సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకుని దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు.
Comments
Loading comments...

