Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రుణాల పేరిట రూ.10 కోట్ల మోసం

Follow Udayam on Google
కీర్తన్ Aug 16, 2026 7:25 AM హైదరాబాద్General
రుణాల పేరిట రూ.10 కోట్ల మోసం - Udayam
బ్యాంకు రుణాలు ఇప్పిస్తానంటూ ఏపీ, తెలంగాణల్లో 30 మందిని రూ.10 కోట్ల మేర మోసగించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న యుగంధర్‌ను హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. బాధితుల ఆస్తులను సేల్‌డీడ్‌ చేయించుకుని ఇతరులకు బదిలీ చేసి, వాటిపై బ్యాంకు రుణాలు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిపై తెలుగు రాష్ట్రాల్లో 20కి పైగా క్రిమినల్‌, సివిల్‌ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...