వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లాడలో సీపీఎం నాయకుడు, అమరజీవి దొడ్డా కృష్ణయ్య 33వ వర్ధంతిని బుధవారం నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. సీపీఎం సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి సేలం సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.
పేదల సమస్యల పరిష్కారం, సమసమాజ నిర్మాణం కోసం కృష్ణయ్య కృషి చేశారని సత్యనారాయణరెడ్డి తెలిపారు. ఆయన ఆశయ సాధనకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

