వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాను ప్రభావంతో బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నర్రావారిపాలెంలో రైతులు సాగు చేసిన పంట పొలాలు నీట మునిగాయి.
చేతికొచ్చిన పంట దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరాకు వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టామని, పంట నీటిపాలైందని వాపోతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

